శరన్నవరాత్రులు | నవదుర్గలు

శ్రీ మాత్రే నమః శరన్నవరాత్రులు శరదృతువులో వస్తుంది కాబట్టి ‘శరన్నవరాత్రులు’ అంటారు. ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి. అందుకే ఈ అశ్వయుజ శుద్ధ పాడ్యమినుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా, శుభ్రంగా ఉండి ఎలాంటి రోగాల దరిజేరవన్నది ఈ నవరాత్రి వేడుకల వెనుక ఉన్న చరిత్ర. మార్కండేయ మహర్షి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అని అడగడంతో బ్రహ్మ ఇలా …

Continue Reading

వజ్రకిలయ || Phurba

వజ్రకిలయ || Phurba దీన్ని సంస్కృతంలో వజ్రకిలయ అని, టిబెట్ దేశంలో Phurba అని అంటారు.. మనం అంజి సినిమాలో చూడవచ్చు..   పూర్వం, టిబెట్ దేశంలో ఉన్న సాధకులు దీన్ని తయారుచేసి, కొన్ని రహస్యమైన మంత్రాలతో “తామస” గుణంతో ఉన్న శక్తిని ఆహవం చేసి వాడేవారు. దుష్టశక్తులను దరిచేరనివ్వకుండా, సాధకులకు అడ్డంకులు కలగకుండా ఇది అడ్డుకుంటుంది. మంచి సాధకులను కూడా క్షుద్ర సాధకులని అనుకునే ప్రజలు, తమను దాడి చేసే అవకాశం ఎక్కువగా ఉంది కనుక, …

Continue Reading

యోని – Universal Energy, Source of Life and The Power of Wisdom

  “యోని” – Universal Energy, Source of Life and The Power of Wisdom   స్త్రీ.. ఆమె శరీరం ఈ మహా విశ్వం, ఒకొక్క అవయవం ఒక్కో భీజాక్షరం, గర్భం విశ్వం యొక్క ఉనికి, యోని స్థానం విశ్వానికి ద్వారం! అంటే ఈ లోకంలో ఎంతమంది స్త్రీలున్నారో అన్ని విశ్వపు  ద్వారాలున్నాయని అర్ధం. ఎటువంటి ప్రాణి అయినా ఆ ద్వ్రారాల ద్వారా “ప్రాణం”తో ఊపిరి తీసుకుంటున్నాయని, మనం కూడా ఒక రూపాన్ని పొంది ఉనికిలోకి …

Continue Reading

కలియుగం – కష్టకాలం

కలియుగం – కష్టకాలం విత్తమేవ కలౌనౄణాం జన్మాచార గుణోదయః ధర్మన్యాయ వ్యవస్థాయాం కారణం బలమేవ హి • శ్రీమద్భాగవతంలో కలియుగ లక్షణాలను ఇలా విస్తృతంగా విపులీకరించారు. కలియుగంలో ధనం వల్ల మాత్రమే గౌరవాదరాలు లభించడం, ధర్మన్యాయ వ్యవస్థలలో బలమే ప్రాధాన్యం వహించడం వంటి దుర్లక్షణాలన్నీ మానవులలో కనిపిస్తుంటాయని వివరించారు. కలియుగం ముందుకు సాగే కొద్దీ మానవుల సమస్త సద్గుణాలూ నశించిపోయి దుర్గుణాలే అధికం కావడం చూస్తాం. అంతేకాదు.. వేలాది సంవత్సరాలుగా ఆచరిస్తున్న సనాతన ధర్మాలను వదిలి పాషండ …

Continue Reading
తెలుగు, సామాజిక సమస్యలు

పురుషులపై హింస

“యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రఫలా: క్రియా:” ~ మనుస్మృతి ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో, అక్కడ దేవతలు పూజలందుకొంటారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడరో, అక్కడ ఎంత గొప్ప సత్కార్యాలైననూ ఫలించవు అని మనుస్మృతి తెలుపుతుంది. కానీ దురదృష్టవశాత్తూ, ఒక తల్లిగా, ఒక సోదరిగా, ఒక కుమార్తెగా, ఒక భార్యగా అత్యంత అరుదైన గౌరవాలను అందుకోవలసిన స్త్రీ, నేడు అత్యంత దారుణంగా, జుగుప్సాకరంగా ప్రవర్తించి తన పై ఉన్న గౌరవాన్ని తానే …

Continue Reading

యక్ష ప్రశ్నలు

సాధారణముగా జవాబు చెప్పటానికి ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎవరైనా వేస్తుంటే మనము “వీడి యక్ష ప్రశ్నలకు జవాబులు చెప్పటం కష్టము” లేదా యక్ష ప్రశ్నలతో విసిగిస్తున్నాడు” అని అంటాము అసలు ఈ యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎవరు ఎవరిని అడిగారు వాటికి సమాధానాలు ఏమిటి? అనే విషయము గురించి క్లుప్తముగా తెలుసుకుందాము. దేవలోకములో ఉండే వారిని గంధర్వులు యక్షులు అని అంటారు. అటువంటి ఒక యక్షుడు అరణ్యవాసము చేస్తున్న పాండవులను ముఖ్యముగా ధర్మరాజును అడిగిన ప్రశ్నలు వాటికి …

Continue Reading
తెలుగు, పురాణగాధలు

కనిపించే పెద్ద గీత – సీత | దాని వెనుక మరుగైన చిన్నగీత – ఊర్మిళ 

కనిపించే పెద్ద గీత – సీత || దాని వెనుక మరుగైన చిన్నగీత – ఊర్మిళ  లక్ష్మణుడికి త్యాగం పేరు చెప్పగానే ఊర్మిళ గుర్తొచ్చింది. తన మాటని జవదాటకుండా అంతఃపురానికే అంకితమయ్యింది. ఒకరకంగా ఊర్మిళని వదిలి రావడం భర్తగా తను చేసింది తప్పే, కాని అన్నగారి మీద ప్రేమ, భక్తి ఈనాటివి కాదు. అభిమానాలు, ప్రేమలు న్యాయ ధర్మాల తర్కానికి అందవు. తను అన్నగారిననుసరించి త్యాగం చేసాననుకుంటున్నారు వీళ్ళందరూ ! తన త్యాగం వెనుక మరొక మూర్తి త్యాగం కూడా వుంది. ఊర్మిళే …

Continue Reading

శతమానం భవతి శ్లోకం

“శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి” అందరికి సుపరిచితమైన వేద మంత్రం. ఋషులు మన కందిచిన వేదాలలో నుండి గ్రహించబడినది. వివాహ మైన లేదా ఏ హందూ శుభ కార్యమైన ఆశీర్వచనంతో ముగించటం ఆనవాయితీగా వస్తోంది. నూతన దంపతులను నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా జీవించమని క్లుప్తంగా అర్థం. ఈ మంత్రానికి అంత శక్తి ఉందాయని సందేహం కలగక మానదు. నిష్టాగరిష్టులైన ఋష్యాదులు, పురో హితులు, విద్య భోదించిన గురువులు, జన్మ నిచ్చిన తలిదండ్రులు …

Continue Reading

దేవీపురం – ఓ అద్బుతమైన అభినవ మణీద్వీపం

  విశాఖ జిల్లాలోని దేవీపురం – ఓ అద్బుతమైన అభినవ మణీద్వీపం విశాఖపట్నానికి దగ్గరలో ఉన్న సబ్బవరం గ్రామానికి 5 కి.మీ దూరంలో, నారపాడు గ్రామశివార్లలో తొమ్మిది కొండల నడుమ,పచ్చని తోటల మధ్య, దేవీపురంలోని శ్రీచక్రాలయంలో “సహస్రాక్షి” గా శ్రీరాజరాజేశ్వరీ దేవి భక్తులకు దర్శనమిస్తోంది. ఇక్కడి ఆలయం అంతా ఒక శ్రీ చక్రమే. ఇంత పెద్ద శ్రీచక్రాలయం ప్రపంచం మొత్తంలో ఇంకెక్కడా లేదు. దేవిపురం విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో ఉన్న అరుదైన హైందవ ఆలయ సముదాయం. …

Continue Reading

ఆధ్యాత్మికత అంటే ఏంటి?

ఈ ప్రపంచంలో అత్యంత దురుపయోగమవుతున్న పదం ‘ఆధ్యాత్మికత’. కొన్నిసార్లు అజ్ఞానం వల్ల, అనేకసార్లు కావాలనే ఈ పదాన్ని సదుపయోగమో, దురుపయోగమో చేస్తున్నారు. ఈ దురుపయోగం కారణంగా అందరిలో ఎంత గందరగోళం ఏర్పడిందంటే అందరూ దానివల్ల ప్రయోజనమేమైనా ఉందా, లేదా అని సందేహించడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇది చాలా అనిశ్చిత స్థితిని ఏర్పరిచింది. ఆ మార్గంలో అనేక సంవత్సరాలు నడచిన తర్వాత కూడా, చాలామందికి అందులో ఎంతో సందిగ్ధత, ఎంతో అపార్థం. ఈ కారణంగానే వారి మనస్సులో ఎన్నో సందేహాలు. …

Continue Reading
X
X